Followers

వస్త్రధారణ సరిగా లేకపోతే అనుమతి లేదు

 వస్త్రధారణ సరిగా లేకపోతే అనుమతి లేదు 

రాజన్న సిరిసిల్ల బ్యూరో /పెన్ పవర్

మండలం లోని తహసిల్దార్ కార్యాలయం వద్ద వస్త్రధారణ సరిగా లేకపోతే అనుమతించబోమని తాసిల్దార్ గోడల పై సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. మహిళలు ఉద్యోగులు హుందాతనం గా ఉంటారని ఇక్కడికి వచ్చే ఫిర్యాదుదారులు క్రమశిక్షణ పాటించాలని తహసిల్దార్ శ్రీకాంత్ తెలిపారు క్రమేపీ కొంతమంది యువకులు చెడ్డీలు వేసుకొని ఇష్టానుసారం పద్ధతులు పాటించకుండా వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళ ఉద్యోగులు ఇబ్బందులు పడతారని చెప్పారు. ఇలాగే వస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని రెవెన్యూ ఉద్యోగులు హెచ్చరిక చేశారు. ఉద్యోగులపై అసభ్యంగా మాట్లాడిన అనుచితంగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించిన వారిపై 186, 189,353 సెక్షన్ ల పై చర్యలు తీసుకోబడతాయని అన్నారు ఒకవేళ రెండు సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించబడుతుందని అన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...