రెండు ఇళ్లలో దొంగతనం 40 వేల నగదు 12.5 సవర్ల బంగారం అపహరణ
సి సి కెమెరాలో దొంగల దృశ్యాలు..
ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐ
పెన్ పవర్ కందుకూరు
దొంగలు రెండు ఇళ్లలో ఒకేరోజు దొంగతనం చేసి 40 వేల నగదు 12.5 సవర్ల బంగారాన్ని అపహరించిన సంఘటన పట్టణంలోని సాయి నగర్ లో జరిగింది. ఒకే రోజు నాలుగు చోట్ల దొంగతనానికి ప్రయత్నించి రెండు ఇళ్లలో తాళాలు పగలగొట్టి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. తాళం వేసిన ఇళ్ళనే టార్గెట్ చేసి రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. సాయి నగర్ లో ఈదర వెంకటస్వామి ఫంక్షన్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లగా సోమవారం రాత్రి గోడదూకి తాళాలు పగలగొట్టి బీరువా తెరిచి అందులో ఉన్న 20 వేల నగదు, రెండున్నర సవర్ల బంగారాన్ని అపహరించినట్లు తెలిపారు. అలాగే సాయినగర్ లోనే దిండికుర్తి నారాయణ కుటుంబ సభ్యులు పెనుకొండ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వెళ్లి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఇంటిలో ఉన్న 10 సవర బంగారం, 20వేల నగదు అపహరించినట్లు వాపోయారు. నారాయణ ఇంటి పక్కన ఇల్లు ఖాళీగా ఉండటం ఎదురుగా నూతన ఇల్లు నిర్మిస్తూ ఉండడం దొంగలకు బాగా కలిసి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టణంలో రెక్కీ నిర్వహించి అదును చూసి కోవూరు రోడ్డు లోని సాయి నగర్ లోని ఇళ్ళలో ఈ పనికి తెగబడ్డారని పిస్తుంది. అక్కడే ఓ ఇంట్లో దొంగతనం చేయబోయి విఫలయత్నం చెందారు. అయితే ఆ ఇంట్లో సి సి కెమెరాలు ఉండటంతో దొంగలు గోడ దూకి ఇంట్లోకి వెళ్ళే దృశ్యాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న డిఎస్పీ శ్రీనివాసులు, సీఐ విజయ్ కుమార్, పట్టణ ఎస్ఐ తిరుపతిరావు ఘటనా స్థలానికి చేరుకొని ఇళ్లను పరిశీలించి చుట్టుపక్కల వారిని విచారించారు. అనంతరం క్లూస్ టీం ను పిలిపించి వేలిముద్ర ఆధారాలను సేకరిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించినట్లు డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలో ఎవరైనా ఇతర గ్రామాలకు వెళ్లేటప్పుడు ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
No comments:
Post a Comment