ఉప్పలపాడు లో ఘనంగా రథసప్తమి వేడుకలు
గండేపల్లి. పెన్ పవర్రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని గండేపల్లి మండలం ఉప్పలపాడు లోని శ్రీ తోట వెంకటాచలం కళ్యాణ మండపంలో సూర్య భగవాన్ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అడబాల కుందరరాజు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ అడబాల ఆంజనేయులు దంపతులు సూర్య నమస్కారాలు, హోమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపాడు, మల్లేపల్లి, సుబ్బయ్యమ్మ పేట, తాళ్లూరు, బొర్రంపాలెం తదితర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment