ఎట్టకేలకుసీటు దక్కించుకున్న "కెల్లా" విజయం సాధించేనా!
ఆరిలోవ, పెన్ పవర్
ఎట్టకేలకు 13వ వార్డు వైసిపి అభ్యర్థిని గా కెల్లా సునీత సత్యనారాయణ.పార్టీలో మొదటి నుండి కష్టపడి పనిచేసిన కెల్లా సునీత సత్యనారాయణ కాదని అప్పుడే పార్టీలోకి వచ్చిన అభ్యర్థికి వైసీపీ టిక్కెట్ కేటాయించడంపై మనస్తాపం చెందిన కెల్లా, తమ కష్టాన్ని గుర్తించి టికెట్ ఇచ్చిన పార్టీ అధిష్టానానికి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించి పార్టీకి బహుమతిగా ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇంతవరకు తనపై నమ్మకం ఉంచి తనకి సహాయ సహకారాలు అందించిన వార్డు నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉండగా వైసిపి టికెట్ ఆశించి భంగపడ్డ సుశీల సుధాకర్ తన ప్రభావం పార్టీపై ఎంతవరకు ఉంటుందో,! పార్టీ విజయానికి ఎంతవరకు సహకరిస్తారో! రెబల్ గా వేస్తారో వేచి చూడాలి. వార్డులో అధిక సంఖ్యలో స్వతంత్రులు ఇతర పార్టీలు ఉండగా కెల్లా సునీత సత్యనారాయణ విజయం సాధించే నా!?
No comments:
Post a Comment