ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్దులను గెలిపించండి
సిపిఎం విస్తృత స్ధాయి సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాజశేఖర్ పిలుపుపెద్దాపురం పెన్ పవర్
నీతిగా, నిజాయితీగా, ప్రజల కోసం నిరంతరం పని చేసే సిపిఎం అభ్యర్దులను పెద్దాపురం మున్సిపాల్టికి పంపించాలని సిపిఎం తూర్పుగొదావరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్.రాజశేఖర్ పిలుపునిచ్చారు. సిపిఎం మండల విస్తృత సమావేశం కేదారి నాగు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాజశేఖర్ ముఖ్యఅతిధిగా పాల్గోని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పెద్దాపురం మున్సిపాల్టిలో ప్రజల సమస్యలపై గొంతెత్తే సిపిఎం నాయకులను కౌన్సిల్ సబ్యులుగా ఎన్నుకొనే వారసత్వం ఉందని అన్నారు. ఆ వారసత్వాన్ని నిలబెట్టడానికి కృషిచేయాలని కోరారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా స్పందించే నాయకులను మనం ఎన్నుకుంటే మంచిదని కోరారు. రాష్ట్రంలో నిత్యవసర ధరలు విపరీతంగా పెంచి ప్రజల నెత్తిన భారాలు మెాపుతున్నారని అన్నారు. ఒకపక్క గ్యాస, మరోపక్క డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచుతున్నారన్నారు. పట్టణంలో నిర్మించిన అపార్ట్ మెంట్ లను లబ్దిదారులకు ఇవ్వకుండా అవస్ధలకు గురి చేస్తున్నారని అన్నారు. 14 వ వార్డు సిపిఎం అభ్యర్ది రొంగల సుబ్బలక్ష్మీ, 15 వ వార్డు సిపిఎం అభ్యర్ది యాసలపు అనంత లక్ష్మీ, 18 వ వార్డు సిపిఎం అభ్యర్ది కూనిరెడ్డి అరుణ, 21 వ సిపిఎం అభ్యర్ది నీలపాల సూరిబాబు ను గెలిపించాలని విజ్ఞాప్తి చేసారు. ఈ సమావేశంలో సిరపురపు శ్రీనివాస్, కూనిరెడ్డి అప్పన్న, డి.కృష్ణ, ఆర్.వీర్రాజు, గడిగట్ల సత్తిబాబు, సత్యవతి, జి.పెంటయ్య, దాకమర్రి ఏడుకొండలు, నెక్కల నరసింహమూర్తి తదితరులు పాల్గోన్నారు.
No comments:
Post a Comment