సభ్యత్వానికి అపూర్వ స్పందన:ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..
కుత్బుల్లాపూర్, పెన్ పవర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 128 చింతల్ డివిజన్ పరిధిలోని దోబీఘాట్ వద్ద స్థానిక డివిజన్ అధ్యక్షుడు మహ్మద్ రఫీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని సభ్యత్వ రశీదులు కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
అనంతరం దోబీఘాట్ లో పూర్తి చేసిన 300 సభ్యత్వాలు, రుసుమును డివిజన్ అధ్యక్షులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ నగర్ వాషర్ మ్యాన్ సొసైటీ అధ్యక్షులు వెంకటయ్య, మహేందర్, యాదగిరి, రమేష్, సాంబయ్య, శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, నర్సింహా, గౌరయ్య, చంద్రమౌళి, పర్షురాములు, రామ్ చందర్, ఆంజనేయులు, వెంకన్న, లక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment