న్యాయవాదులు వామన్ రావు నాగమణి లను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి
మందమర్రి పెన్ పవర్ :
హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు, నాగమణి దంపతులను మంథని టిఆర్ఎస్ పార్టీ నాయకులు పుట్ట మధు అతని గుండాలు కుంట శీను, చిరంజీవి, బిట్టు శీను పట్టపగలు అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా హత్య చేయడాన్ని ఎమ్మార్పీఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి తీవ్రంగా అందిస్తుందని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వాసాల సంపత్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొట్లాడి సాధించుకున్న అటువంటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఉద్యమ సమయంలో న్యాయవాదులు కీలకంగా ఉద్యమిస్తే ఇవాళ న్యాయవాదులకు ఎలాంటి ప్రాణ రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఇందుకు కారణం కెసిఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి దొడ్డి దారిన ముఖ్యమంత్రి అయినా కెసిఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని, అదేవిధంగా ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ముఠాలను తయారు చేసుకొని భూకబ్జాలు ఇసుక మాఫియా సెటిల్మెంట్లు చేస్తూ వాళ్ల సొంత ప్రయోజనాల కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇందుకు నిదర్శనమే మంథని ఏరియాలో పుట్ట మధు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో ఒక దళిత మాదిగ యువకుడు పుట్ట మధు బంధువులు అమ్మాయిని ప్రేమించినందుకు అతని ఇంట్లో నుంచి బయటకు పిలిచి అతి దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తెలిపారు. అదేవిధంగా మంథని ఏరియాలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఎదురు చెప్పిన వారిని భయబ్రాంతులకు గురి చేస్తూ, అడ్డగోలుగా ఇసుక మాఫియా కొనసాగిస్తు, 2019 ఎన్నికల సమయంలో ఈసీకి సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్లో పుట్ట మధు ఆస్తులను తక్కువగా చూపిస్తే వీటన్నిటి మీద వామన్ రావు అతని భార్య నాగమణి హైకోర్టులో పిటిషన్ ను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పుట్ట మధు ఆస్తులు 900 కోట్లు ఉన్నట్లు సేకరించి హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఇదంతా తలనొప్పిగా మారిన వామన్ రావు కుటుంబాన్ని అంతమొందించాలని పథకం ప్రకారమే కుంట శీను, చిరంజీవి, పుట్ట మధు మేనల్లుడు బిట్టు శీను అందరికీ పురమాయించి పరోక్షంగా ఈ హత్యలకు కారణమయ్యారని తెలిపారు. పుట్ట మధును కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని, అతని టిఆర్ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, జెడ్పి చైర్ పర్సన్ పదవి నుంచి తొలగించాలని హత్య చేసినటువంటి దుండగులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించాలని, ఈ కేసును సీబీఐతో ఇన్వైట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మండలం ఇంచార్జ్ వాసాల సంపత్, పట్టణ ఇంచార్జ్ సంగి రవి, గిన్నారపు రవి, మిట్టపల్లి బాబు, సప్పిడి శ్రీనివాస్, నల్లాల తిరుపతి, వికలాంగుల హక్కుల పోరాట సమితి పట్టణ అధ్యక్షులు మూలకాల రాజేంద్రప్రసాద్, పూసాల రమేష్, సుంక శీను, పులిపాక కృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment