Followers

పురపోరులో రెబల్స్ జోరు

 పురపోరులో రెబల్స్ జోరు 

 ఐదు వార్డులో వైసిపి రెబల్స్ 

నాయకుల తాయిలాలు, లొంగని స్వతంత్రులు

నర్సీపట్నం, పెన్ పవర్ 

నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీకి రెబల్స్ వ్యవహారం తలనొప్పిగా మారింది. సహజంగా అధికార పార్టీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీలోనూ కొనసాగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కొన్ని వార్డుల్లో రెబల్ అభ్యర్థులను బుజ్జగించి, తన దారికి తెచ్చుకున్నారు. అయితే ఇంకా కొన్ని వార్డుల్లో అనిశ్చితి  కొనసాగుతోంది. ఎమ్మెల్యే , పార్టీలో సీనియర్లు ఎంత నచ్చజెప్పినా మాట వినడం లేదు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచి పార్టీకి అండగా ఉంటామని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే చొరవ చూపి ఆరో వార్డులో మళ్ళ గణేష్ , 12 వార్డులో దాసును తన దారికి తెచ్చుకున్నారు. అయితే 1, 2 వార్డులలో మాకిరెడ్డి అప్పారావు దంపతులు,  మూడవ వార్డులో మామిడి శ్రీనివాసరావు, 14 వ వార్డులో వర్రే శ్రీనివాసరావు, 15 వార్డులో పెద్దిరెడ్ల శ్రీనివాసరావు స్వతంత్రులుగా బరిలో కొనసాగుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, పుర పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార పార్టీకి స్వతంత్రులే అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...