ఉప్పరపల్లి లో ఘనంగా లింగమంతుల జాతర:హాజరైన ఎమ్మెల్యే శంకర్ నాయక్.
మహబూబాబాద్/పెన్ పవర్;
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామం లో బుధవారం లింగమంతుల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా యాదవ కులస్తులు తమ ఇంటి నుంచి బోనాలు ఎత్తుకుని ఆలయ ప్రాంగణానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోళ్లను యాటలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ రంగారావు, జడ్పిటిసి శ్రీనాథ్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు, దామర కొండ ప్రవీణ్ కుమార్, సర్పంచులు సారయ్య బట్టి శ్రీను సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment