ఘనంగా రథసప్తమి పూజలు
సామర్లకోట, పెన్ పవర్:పంచారామా క్షేత్రమైన శ్రీ కుమార రామ భీమేశ్వరాలయంలో రధసప్తమి పూజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆ కార్యనిర్వహణాధికారి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆలయంలోని ఉపాలయాల్లో ఉన్న సూర్యనారాయణస్వామి వారికి ఉదయం నుంచి మధ్యహ్నం వరకు విశేష పూజలను నిర్వహించారు. స్వామివారి ఆలయాన్ని పూలమాలలతో సుందరంగా తీర్చిదిది. స్వామివారికి పంచామృతాభిషేక పూజలను, స్వామివారి కళ్యాణ పూజలను నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో ఉంచి భక్తుల దర్శనార్థం అనుమతించారు. అనంతరం ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ
చైర్మన్ మట్టపల్లి రమేష్ బాబు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment