Followers

మహిళ ఆత్మ రక్షణ పై అవగాహన సదస్సు

 మహిళ ఆత్మ రక్షణ పై అవగాహన సదస్సు

మందమర్రి / పెన్ పవర్ :


సమాజంలో స్త్రీల పై దాడులు అధికమవుతున్నాయని, దాడి జరుగుతున్న సమయంలో మహిళలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, ఆ సమయంలో ఏం చేయాలి ఇలాంటి విషయాలపై ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఎస్సై లింగంపల్లి భూమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మహిళ దైర్యంగా ఉండాలని, మీ దైర్యమే మీకు రక్షణ అని పేర్కొన్నారు. ఎవరైనా మహిళలు ఎలాంటి ఆపదలకు, వేదింపులకు గురి అయితే దైర్యంగా షీ టీంను సంప్రదించాలని, ఎవరైన అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానిక పోలిస్ స్టేషన్ కీ సమాచారం అందించాలని సూచించారు. అదేవిధంగా పట్టణ ప్రముఖ కరాటే మాస్టర్. రంగు శ్రీనివాస్ ఆత్మ రక్షణకు మెరుగైన మెలకువలు, సూచనలు  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్, ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుదేవ్, కెప్టెన్ రాజు, లోబో చింటూ, బన్నీ, పాఠశాల ఉపాద్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...