Followers

గ్రంధాలయ సెస్ విడుదలకు చొరవ చూపండి

 గ్రంధాలయ సెస్ విడుదలకు  చొరవ చూపండి  

జేసీ కిషోర్ కుమార్ కు వినతిపత్రం అందజేసిన ఆమ్ ఆద్మీ పార్టీ 

పెన్ పవర్,విజయనగరం

జిల్లాలో స్థానిక సంస్థల నుండి గ్రంధాలయ సంస్థకు రావాల్సిన సెస్ బకాయిలను వెంటనే విడుదల చేసేలా చొరవ చూపాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కె.దయానంద్ JC కిశోర్ కుమార్ ను కోరారు. గురువారం నాడు పార్టీ సభ్యులతో జాయింట్ కలెక్టర్  ను కలిసి ఈమేరకు  వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా దయానంద్ మాట్లాడుతూ గత పదేళ్లుగా జిల్లాలో వున్న మున్సిపాలిటీ లు, పంచాయతీల నుండి సుమారు 10 కోట్ల రూపాయలు  వరకూ రావాల్సి ఉందని, సకాలంలో సెస్ అందకపోవడం వలన నిధుల కొరత ఏర్పడిందని అన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి నిధుల కొరత తీవ్ర ఆటంకంగా మారిందని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 40శాఖ గ్రంధాలయాలు వున్నాయని , అందులో 20 మాత్రమే సొంత భవనాల్లో నడుస్తుండగా 10 గ్రంధాలయాలు దాతల విరాళం తోనూ, మరో 10 అద్దె భవనాల్లోనూ నడుస్తున్నాయని అన్నారు. గతం కన్నా గ్రంథాలయాలకు వచ్చే యువత, విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని, అయితే అవసరమైన పుస్తకాలు, మౌలిక సదుపాయాలు కొరవడ్డాయని, దీనికి కారణం నిధుల కొరతేనని అన్నారు. మీ-సేవా కేంద్రాలలో చెల్లించే పన్నుల ద్వారా గ్రంధాలయ సెస్ వెంటనే సంస్థకు చేరుతున్నా మున్సిపాలిటీలు, పంచాయతీలలో నేరుగా చెల్లిస్తున్న పన్నుల ద్వారా రావాల్సిన సెస్ మాత్రం పదేళ్లుగా గ్రంధాలయ సంస్థకు చేరకపోవడం దారుణమని అన్నారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి కొత్తగా ప్రజాప్రతినిధులు ఎన్నికైనందున గ్రంధాలయ సెస్ వేరే కార్యక్రమాలకు వెచ్చించకుండా తక్షణమే సెస్ మొత్తాన్ని స్థానిక సంస్థల నుండి గ్రంధాలయ సంస్థకు ఇప్పించేలా చొరవ చూపాలని ఆయన కోరారు. జేసీ ని కలిసిన వారిలో యూత్ కన్వీనర్ రొబ్బా లోవరాజు, నియోజకవర్గం కన్వీనర్ తిప్పాన కోటేశ్వరరావు, విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...