Followers

ప్రశాంతయుతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చర్యలు - ఎస్పీ బి.రాజకుమారి, ఐ.పి.ఎస్


 ప్రశాంతయుతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు చర్యలు - ఎస్పీ బి.రాజకుమారి, ఐ.పి.ఎస్

విజయనగరం పెన్ పవర్

విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతాపరమైన చర్యలుచేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఫిబ్రవరి 25, గురువారం నాడు ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పోలీసు అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ - విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలు, నెల్లిమర్ల నగరపంచాయతీలకు మార్చి 10న జరగబోవు ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలను చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పార్వతీపురంకు అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావును, సాలూరు మున్సిపాల్టీకి ఓఎస్ డి ఎన్.సూర్యచంద్రరావు, బొబ్బిలికి డిఎస్పీ బి.మోహనరావు, విజయనగరంకు పి. అనిల్ కుమార్, నెల్లిమర్లకు సిసిఎస్డి ఎస్పీ జె.పాపారావులను ప్రత్యేకంగా పర్యవేక్షణాధికారులుగా నియమించామన్నారు. హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ వార్డులను,తగాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను డిఎస్పీలు, సిఐలు సందర్శించి,గొడవలు జరగకుండా అక్కడి ప్రజలతో అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో గొడవలు జరిగిన ప్రాంతాలను, ఆయా గొడవల్లో నిందితులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వార్డుల్లో సమస్యలు సృష్టించే వారిని ముందుగా గుర్తించి, మంచి ప్రవర్తనకుగాను మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు వద్ద వారి నుండి బాండులు తీసుకోవాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమన్వయంగా మెలిగి, మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.రెవెన్యూశాఖ నుండి కూడా ఒక్కొక్క మున్సిపాల్టీకి ప్రత్యేకాధికారులను ఉన్నతాధికారులను నియమించిందని, వారితో సంయుక్తంగా వార్డుల సందర్శన చేయాలని, అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్ అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని, నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వార్డుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ప్రత్యేకంగా కొద్దిమంది పోలీసు సిబ్బందిని నియమించి, ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. సెక్షను 30 పోలీసు చట్టం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అమలులో ఉన్నందున పోలీసుశాఖ నుండి ముందస్తు అనుమతులు లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. ఎవరైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలనుకొంటే తప్పనిసరిగా పోలీసుశాఖ నుండి ముందస్తు అనుమతి పొందాలన్నారు. వాహన తనిఖీలు, నాఖాబందీలు ఆకస్మికంగా చేపట్టాలన్నారు. వాహనాలు, మైక్ పెర్మిషన్లును సంబంధిత డిఎస్పీలు వారు ఇచ్చిన దరఖాస్తులను కుణ్ణంగా పరిశీలించిన తరువాతనే అనుమతులు మంజూరు చేయాలన్నారు.సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ వార్డుల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్లాగ్ మార్చ్ లు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు, విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్, బొబ్బిలి బి.మోహనరావు, పార్వతీపురం డిఎస్పీ ఎ.సుభాష్, సిసిఎస్ డిఎస్పీ జె.పాపారావు, ఎస్సీ మరియు ఎన్టీ సెల్ డిఎస్పీలు ఆర్.శ్రీనివాసరావు, పి. రామారావు, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ఎస్బీ సిఐలు జి. రాంబాబు, ఎన్.శ్రీనివాసరావు, రుద్రశేఖర్,డిసిఆర్ బి సిఐ బి.వెంకటరావు, 1వ పట్టణ సిఐ జె.మురళి, 2వ పట్టణ సిఐ సిహెచ్. శ్రీనివాసరావు, రూరల్ సీఐ టి.ఎస్.మంగవేని, సాలూరు సిఐ అప్పలనాయుడు, బొబ్బిలి సిఐ కె.కేశవరావు, ఎస్టలు ఫకృద్దీన్,పి.నారాయణరావు, కళాధర్,దామోదరరావు, ధనుంజయనాయుడు,అశోక్ కుమార్, గంగరాజు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...