ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
కూకట్ పల్లి, పెన్ పవర్
బౌన్స్ సంస్థకు చెందిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి అమ్ముకుందామనుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కూకట్ పల్లి పోలీసులు. శనివారం కూకట్ పల్లి ఏసిపి కార్యాలయంలో ఏసిపి సురేందర్ రావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా శంకరపల్లి మైతాబ్ ఖాన్ గూడకు చెందిన అవసలి నరేష్(28) మెకానిక్ గా పని చేస్తున్నాడు.
బౌన్స్ అనే ద్విచక్ర వాహనాలు అద్దెకు ఇచ్చే సంస్థకు చెందిన ఐదు ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి ఊరిలో ఉన్న మెకానిక్ షాపుకు తీసుకెళ్లి వాటికి ఉన్న రంగులను మార్చి అమ్మకానికి సిద్ధం చేస్తుండగా నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో రెండు సంవత్సరాలు బౌన్స్ సంస్థలో టెక్నీషియన్ గా పని చేసిన నరేష్ గత రెండు నెలలుగా వినియోగదారులు వాడుతున్న వాహనాల జిపిఎస్ వైర్లను కత్తిరించి తన ఊరిలో ఉన్న మెకానిక్ షాపుకు తీసుకెళ్లి మూడు ద్విచక్ర వాహనాలకు రంగులు మార్చి అమ్మే క్రమంలో కూకట్ పల్లి పోలీసులు శుక్రవారం సాయంత్రం నిందితుడుని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్టు కూకట్ పల్లి ఏసీపీ సురేందర్ రావు తెలిపారు.
దొంగను అదుపులోకి తీసుకునే క్రమంలో చాక చక్యంగా వ్యవహ రించిన సిబ్బందిని ఏసిపి అభినందించారు. ఈ సమావేశంలో కూకట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సింగ్ రావు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment