Followers

స్వేరోస్ ఎన్టీపీసీ పట్టణ నూతన కమిటీ

 స్వేరోస్ ఎన్టీపీసీ పట్టణ నూతన కమిటీ


రామగుండం / పెన్ పవర్

స్వేరోస్ ఇంటర్నేషనల్ రామగుండం మండల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రగడపల్లి నారాయణ , కల్వల మహేందర్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డా.వేల్పుల సురేందర్ ఆదేశాల మేరకు స్వేరోస్ ఎన్టిపిసి పట్టణ  నూతన కమిటీని ఎన్నుకున్నారు.ఎన్టీపీసీ పట్టణ కమిటీ అధ్యక్షులు గా మాదాన నరేష్, ఉపాధ్యక్షులు గా కరీముల్లా వెంకటేష్ ,ప్రధాన కార్యదర్శి గా టి రాజేందర్ ,జెయింట్ సెక్రెటరీ గా రాజేశం ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా మేకల కుమారస్వామి ,

కోశాధికారిగా  ఎం.దేవేందర్,సభ్యులు గా ఈ. కిషన్ ,పి. మహేందర్ , ఎం. ప్రసాద్ లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా పెగడపల్లి నారాయణ ,కల్వల మహేందర్ 

ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ  కాన్సిరాం జయంతిని మార్చి 15 నుండి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 15 వరకు ప్రతి సంవత్సరం భీమ్ దీక్ష నిర్వహిస్తామన్నారు.ఈ సంవత్సరం పెద్దపెల్లి జిల్లాలోని ధూళికట్ట లో ఉన్నటువంటి బుద్ధుని స్తూపం వద్ద భీమ్ దీక్ష ప్రారంభించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ వస్థారని, పట్టణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది మేధావులు , విద్యార్థులు విద్యార్థి సంఘాలు , యువజన నాయకులు , ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని భీం దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి  డి. రఘు,  మచ్చ కుర్తి రమేష్ , బిజిలి నరేష్ , పెగడపల్లి ఉమేష్ నవీను,  సంతోష్  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...