Followers

పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన

 పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన

బెల్లంపల్లి నియోజకవర్గం , పెన్ పవర్


దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగ శుక్రవారం సింటా, ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ బందులో భాగంగా బెల్లంపల్లి లైన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్నాల ఫ్లై ఓవర్ నుండి కాల్ టెక్స్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిరాజోద్దీన్ మాట్లాడుతూ పెంచిన పెట్రోల్,డీజిల్ రేట్లను తగ్గించాలని,పెట్రోల్,డీజిల్ ను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని,స్క్రాప్ట్ పాలసీని అమలు చేయాలని,థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని,గ్రీన్ టాక్స్ వసూలు నిర్ణయాన్ని విరమించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సందీప్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్,కమిటీ నాయకులు ఎండి ఎజాజ్, అప్జల్, సలీమ్,ముజాంబిల్,రాజు,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...