Followers

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కూన శ్రీశైలం గౌడ్

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కూన శ్రీశైలం గౌడ్ 


కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ డిసిసి ప్రెసిడెంట్ కూన శ్రీశైలం గౌడ్ పార్టీ పదవులతోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. కూన శ్రీశైలం గౌడ్.


కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నాను

గత మూడు దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో ఉంటున్నాను

2009లో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇయ్యకున్నా ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిపొందాను

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా,మాజీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన పోరాటం చేసాను.

కుత్బుల్లాపూర్, పెన్ పవర్

గత ఆరేడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి, ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందింది. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలో విఫలమైంది. ఇవన్నీ చూసిన ప్రజలు కూడా టిఆర్ఎస్ అక్రమాలను,హామీల అమలు చేయడంలో వైఫల్యాలను కాంగ్రెస్ పోరాడలేదని ఒక నిర్ణయానికి వచ్చారు, దీనికి ఉదాహరణ దుబ్బాక ,జిహెచ్ఎంసి ఎన్నికల్లో స్పష్టమైంది. చివరకు పీసీసీ చీఫ్ రాజీనామా చేసినా కొత్త నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యం జరిగే కారణం,  పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలేనని,ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని, ప్రజల సమస్యలపై పోరాటం చేయాలంటే బీజేపీతోనే సాధ్యమని ఓ నిర్ణయానికి వచ్చానని, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా టీఅర్ఎస్పై అసలుసిసలు పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీనే అని నిర్ణయానికి వచ్చానని అన్నారు. అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు..



2009 కొత్తగా పునర్విభజనలో ఏర్పడ్డ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మొట్టమొదటి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి చరిత్ర సృష్టించాడు... నాడు కాంగ్రెస్ ..బిజెపి ..వేరువేరుగా .టిఆర్ఎస్ పొత్తు ద్వారా పోటీ చేసినప్పటికీ ప్రజలు మాత్రం వైయస్సార్ అనుంగశిష్యుడుగా ఉన్న కూనశ్రీశైలంగౌడ్ను  గెలిపించారు. 2009లో ఇండిపెండెంట్గా గెలిచి నాడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కాంగ్రెస్ అనుబంధ సంఘ సభ్యునిగా కొనసాగారు. వైయస్సార్ కు నమ్మినబంటుగా ఉంటూ పాదయాత్ర చేస్తున్న క్రమంలో మొత్తం అన్ని తానై చూసుకున్నాడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీసీ నాయకునిగా గుర్తింపు పొందిన కూన శ్రీశైలం గౌడ్ ప్రజాబలం ఉన్న నాయకుడు. దీంతో బీజేపీ శ్రేణులు అతనిపై గత సంవత్సర కాలంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆది నాయకుల నుండి ఒత్తిడి తెచ్చారు. పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసిన ఇంతవరకు కొత్త వ్యక్తిని నియమించకపోగా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మూలంగా ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నట్లు తెలిసింది.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...