Followers

ఉపాధి హామీ పనులను పరిశిలించిన ఎంపివో పార్థసారథి..

 ఉపాధి హామీ పనులను పరిశిలించిన ఎంపివో పార్థసారథి..



నెల్లికుదురు,పెన్ పవర్. 


మహుబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలపరిధిలోని గ్రామాలలో నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను మండలాధికారులు పరిశీలించారు..

ఇందులో భాగంగా మండలం లోని శ్రీరామగిరి గ్రామంలో ఉపాధి కూలీలు చేస్తున్న ఎస్సెమ్ సి ట్రెంచ్ పనులను ఎంపీవో, బి.పార్థసారధి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండి అంజద్అలీతొ కలిసి పర్యవేక్షించారు.




 ఈ సందర్బంగా వారు కూలీలతో మాట్లాడుతూ ఉపాధి పనులను ప్రతి ఒక్క కూలి ఉపయోగించుకొని లబ్ది పొందాలని మరియు కూలీలు రోజుకు నాలుగు నుండి ఐదు గంటలు కొలత ప్రకారం పనిచేసినట్లయితే పూర్తి పేమెంట్ పొందవచ్చని, అందరు కూలీలు ఈ పనులను తప్పనిసరిగా ఉపయగించుకోవాలని వారు వివరించారు ఈ కార్యక్రమంలో డొనికెని శ్రీనివాస్ మరియు ఉపాధి హామీ మేట్స్, కూలీలు మద్దెల నర్సయ్య, డొనికెని మల్లయ్య, తాళ్ల సోమయ్య, మడిపెద్ది గట్టయ్య, బిక్షం, మద్దెల యాకన్న, సామల నర్సయ్య, గొల్లపెల్లి రమేష్, మౌనిక, సృజన్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...