Followers

సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ మెసేజ్ లు..

 సోషల్ మీడియాలో వస్తున్న  ఫేక్ మెసేజ్ లు..




 అయోమయంలో నలిగి పోతున్న జనం..

 బాధ్యులపై కనిపించని  చర్యలు

పెన్ పవర్ బ్యూరో -(విశాఖపట్నం)

 సోషల్ మీడియాను శోధించడం  ప్రజలకు నిత్యకృత్యంగా మారిపోయింది. తెల్లవారింది మొదలు అర్థ రాత్రి వరకు  సెల్ ఫోన్ తో  కాలం వెళ్లదీస్తున్నారు. వింతలు విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం పరిపాటిగా మారింది. కానీ  సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలు ప్రజలను కంగారు పెట్టిస్తున్న సంఘటనలు లేకపోలేదు. అదిగో పులి ఇదిగో తోక అన్న చందంగా  తప్పుడు సమాచారాన్ని విడుదల చేస్తున్నారు. అవి నిజమో కాదో అన్న సందిగ్ధంలో ప్రజలు తెలుసు కోలేక పోతున్నారు. ఎక్కడో కూలిన ఫ్లైఓవర్ ను  హైదరాబాదులో  కూలి కార్లు ధ్వంసమయ్యాయి అని  సోషల్ మీడియాలో వచ్చింది. ఇది నిజమా అని  ఆ ప్రాంతానికి  చెందినవారు సంబంధించిన వారు  హడలి పోక తప్పలేదు. తీరా చూస్తే అది ఎక్కడోజరిగింది.  కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో ఏపీ ప్రభుత్వం  పాఠశాలలు  కళాశాలలకు  మార్చి 1 నుంచి మే 4వ తేదీ వరకు సెలవు ప్రకటించిందని. ఈ మేరకు ఆయా విద్యా సంస్థలకు ఉత్తర్వులు జారీ చేశారని సోషల్ మీడియాలో  వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించి  విద్యా శాఖ మంత్రి  జారీచేసిన పత్రాన్ని వాట్సాప్ లో  షేర్ చేశారు. ఈ సమాచారం చూసిన ప్రతి ఒక్కరూ నిజంగా  కరోనా తీవ్రత  పెరిగిందా? ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించిందా?అన్న సందిగ్దతలో  పడ్డారు. లాక్ డౌన్ నేపద్యంలో కోవిడ్ 19  నిబంధనల ప్రకారం ఇటీవలే అంచలంచలుగా పాఠశాలలు కళాశాలలు తెరిచిన విషయం తెలిసిందే. ఇంతలో ఈ మెసేజ్ లు రావడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. ఇది నిజం కాదని నిర్ధారించు కోవడానికి  సంప్రదింపులు చేయక తప్పలేదు. ఇలా రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక  ఉత్కంఠ కలిగించే  సమాచారాన్ని విడుదల చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ అధికారులను సైతం తప్పుదోవ పట్టించే  మెసేజ్ లు వెలువడుతున్నాయి అంటే ఆశ్చర్యం కలుగుతుంది. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా పరోక్షంగా ఎవరినీ కించపరిచిన  తప్పుడు సమాచారం  వైరల్ చేసిన వారిపై కఠినంగా  చర్యలు తీసుకునే ఆంక్షలు ఉన్నాయి. కాని  ఆకతాయిలు  చేసే మెసేజ్ లు  ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఒక గ్రామంలో  దెయ్యం సంచరిస్తుంది.  ప్రజల రక్తాన్ని  తాగిస్తుంది  అన్న ప్రకటన సోషల్ మీడియాలో వచ్చిన విషయం తెలిసిందే. ఇలా చెప్పుకొని పోతుంటే  లెక్కలేని ఫేక్ మెసేజ్ లు వస్తున్నాయి. వాటిని అరికట్టించాల్సిన  అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ లను అరికట్టాలని   మేధావులు  ప్రజా  సంఘాలు కోరుతున్నాయి..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...