రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహం ముందు పెట్రోల్, డీజిల్ , గ్యాస్ లపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు.ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్,సిరిసిల్లా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ,రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ధరలను పెంచి నిలువునా దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు.మోడీ ప్రభుత్వం రామ రాజ్యం అని చెప్పుకుంటుంది.రామ రాజ్యంలోప్రజలు సుభిక్షంగా ఉండాలి కానీ ధరల పెరుగుదల వల్ల మరింత పేదలుగా తయారవుతున్నారన్నారు . సీత పుట్టిన నేపాల్ రాజ్యంలో లీటర్ పెట్రోల్ ధర 54 రూపాయలు ఉంటే ,రావణ రాజ్యంలో లీటర్ పెట్రోల్ ధర 52 రూపాయలు ఉంటే మరి రామరాజ్యంలో 94 రూపాయలు ఉంటే ఇది రామ రాజ్యం ఎట్లయితది అన్నారు.ఇది ఏం రాజ్యం పేద లు మోయలేని విధంగా ధరలు పెరిగితే ఈ మోడీ ప్రభుత్వం రామ రాజ్యంఎలా అవుతుంది అన్నారు.కాబట్టి మోడీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలి అన్నారు.అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గితే మోడీ ప్రభుత్వం చమురు ధరలు ఎందుకు పెంచుతున్నారని,అన్ని ప్రభుత్వరంగ సంస్థలు అమ్మే ఆలోచనలతో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు.కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేద,మధ్య తరగతి ప్రజలను నిలువు దోపిడీ చేసే ప్రభుత్వాలుగా తయారైనవన్నారు. .రైతులను నల్ల చట్టాలతో నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ధరలు తగ్గించనిచో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరంతరంగా పోరాటం చేసి ప్రజలకు అండగా నిలుస్తామని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆటోకు తాడు కట్టి గ్యాస్ ధరలు తగ్గించాలని ఆటోను కొంత దూరం లోగి ,కర్రాలతో వంట చేసి నిరసనను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,పార్టీ కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment