అంబిర్ చెరువును పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ
కూకట్ పల్లి,పెన్ పవర్
ప్రగతినగర్ అంబీర్ చెరువు సుందరీకరణ పనులను నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నీల గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్ రాజు యాదవ్ తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తితో శుక్రవారం అంబిర్ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను వేగవంతం చేసి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఈసందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈకార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, గోపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నాయినేని చంద్రకాంత్, జోగిపేట్ భాస్కర్, బాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment