Followers

పార్టీ బలోపేతానికి కృషి

 పార్టీ బలోపేతానికి కృషి

టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్యం ప్రమోద్ రెడ్డి

గ్రామ గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు.. 

ఉత్సాహంగా పాల్గొంటున్న నాయకులు కార్యకర్తలు



 బేలా (అదిలాబాద్), పెన్ పవర్ 


 టిఆర్ఎస్ పార్టీని  మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్యం ప్రమోద్ రెడ్డి అన్నారు. శనివారం  మండలంలోని పోనాల గ్రామంలో చేపట్టిన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పార్టీలో లేనటువంటి ప్రాధాన్యత టిఆర్ఎస్ పార్టీలో లభిస్తుందని, టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల జీవిత బీమా లభిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేసుకునేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు అవినాష్ రావు, అమూల్, శాశికాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...