విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రిలే నిరాహారదీక్ష..
పెన్ పవర్/మహబూబాబాద్;
విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ
తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ టిఏస్ఇఇ యూనియన్ 327 ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులకు బుధవారం రిలే నిరాహారదీక్ష ను చేపట్టారు. . ఈ సంధ ర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరారు. విద్యుత్ కార్మికుల పలు డిమాండ్లు ....ఆర్టిజన్ ఉద్యోగులకు ఎ.పి.యస్.ఇ.బి. సర్వీసు రూల్స్ వర్తింప చేయాలి,మరియు ఆర్జిజన్ల పర్సనల్ పేను బేసిక్ పే లో కలపాలని,విద్యుత్ సంస్థలో 01.02.1999 నుండి 31.08.2004 సంవత్సరం వరకు ఉద్యోగంలో చేరిన వారికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలి,మిగిలిన కాంట్రాక్ట్ కార్మికులందరిని (అన్మాన్డ్ వర్కర్స్, స్పాట్ బిల్లర్స్ బిల్ కలెక్టర్స్ యస్.పి.యమ్ వర్కర్స్ మరియు స్టోర్లో పని చేసే హమాలీలను) ఆర్టిజన్లుగా గుర్తించాలి. అన్ని సబ్ స్టేషన్లకు వాచ్ మెన్లను నియమించాలి.
ఫీల్డ్ లో పనిచేస్తున్న ఆర్టిజన్లకు టి.ఎ బిల్స్ ఇవ్వాలి మరియు ఆర్టిజన్లను సొంత జిల్లాలకు బదిలీలు చేయాలి సబ్ స్టేషన్లలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి, ఆర్టిజన్ల రెగ్యులరైజేషన్ ను తేది. 29-07-2017 గా నిర్ణయించాలి.రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించువైద్య సదుపాయాలన్ని ఆర్టిజన్ కార్మికులకు వర్తింపచేయాలి అలాగే ఆర్టిజన్ల కాంట్రాక్ట్ సర్వీసును గ్రాట్యూటికి కలుపాలి.2006-07లో జె.యల్.యం నోటిఫికేషన్ ప్రకారం క్వాలిఫై అయిన అభ్యర్థులందరికి కామన్ జడ్జిమెంట్ ప్రకారం జె.యల్.యం ఉద్యోగాలు కల్పించాలి జెన్‌కోలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు క్వార్టర్స్ సదుపాయము మరియు జెన్కో అసుపత్రులలో వైద్య సదుపాయము కల్పించాలి. ప్రైవేట్ కేసులలోసస్పెండ్ అయిన ఆర్టిజన్లను వెంటనే విధులలోకి తీసుకోవాలి మరియు సస్పెండ్ అయిన తేది నుండి సబ్ స్టెన్సివ్ అలవెన్లు ఇవ్వాలి. 2011లో రిక్రూట్‌మెంట్ అయిన జూనియర్ లైన్ మెన్ లకు జాయినింగ్ తేది నుండి పేపిక్సేషన్ ఎరియర్స్ ఇవ్వాలని..
ఎన్పీడీసీఎల్ జేఎల్ఎంకు ట్రాన్స్ఫర్ కు అవకాశం కల్పించాలని,విద్యుత్ కార్మికులకు, ఉద్యోగులకు కోటి రూపాయల జనరల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.. సీనియర్ ఫోర్ మెన్ పోస్టు మరియు లైన్ ఇన్స్పెక్టర్. లైన్మెన్,సీనియర్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే మంజూరు చేయాలని కోరారు.విద్యుత్ ఉద్యోగులు మరియు ఆర్టిజన్ కార్మికులకు పరిమితి లేని వైద్యసదుపాయం కల్పించాలన్నారు. సమస్యల సాధన కొరకు ఫిబ్రవరి 24,25 తేదీలలో రిలే నిరాహార దీక్షలు, హైదరాబాదులోని ఎస్పీడీసీఎల్ ముందు మార్చి 2న నిరసన,వరంగల్ లోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం ముందు మార్చి 5 న ధర్నా కార్యక్రమం, మార్చి 18న హైదరాబాదులోని విద్యుత్ సౌధా ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈకార్యక్రమంలో సంఘ బాధ్యులు పాల్గోన్నారు.
No comments:
Post a Comment