సస్యరక్షణ చర్యలు పాటిస్తే వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు...
రైతు శిక్షణలో ఎడిఎ పద్మశ్రీ
సామర్లకోట, పెన్ పవర్:పంట పొలాల్లో పంటల దశలను, వేసిన పంటలను బట్టి సస్యరక్షణ చర్యలు వ్యవసాయాధికారుల సూచనల మేరకు పాటిస్తే పంటలకు వ్యాప్తి చెందే వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చునని జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పద్మశ్రీ అన్నారు. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో శుక్రవారం ఆత్మ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి ఐ సత్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కాకినాడ ఎడి పద్మశ్రీ విచ్చేసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ పంట పొలాల్లో నీరు ఎక్కువ రోజుల పాటు ఎక్కువగా నిలిచి ఉంటే వెంటనే ఆ నీటిని భయటకు పంపించే ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగాక మురుగునీరు పంట పొలాల్లో ఉంటే దాని వలన ప్రధానంగా దుబ్బుకుళ్ళు వ్యాధులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుందన్నారు. ప్రస్తుత పంట కాలంలో దీనిని ప్రధానంగా రైతులు గమనించు కోవాలన్నారు. అలాగే వరిపంటకు సంబందించి ఎప్పటికపుడు వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తూ సస్యరక్షణ చర్యలు అవలంబించి లాభదాయక వ్యవసాయాన్ని పొందవచ్చునన్నారు. అలాగే పంటల భీమా, ఇన్ పుట్ సబ్సిడీ, సున్నావడ్డీ రుణాలు రైతులు పొందాలంటే విధిగా రైతులంతా ఇ-పంట "నమోదులు చేయించు కోవాలన్నారు. ఈ శిక్షణలో ఇంకా గ్రామ పరిదిలోని వ్యవసాయ సహాయాదికారులు, రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment