పెగడపల్లిలో సిసి కెమెరాలు ప్రారంభించిన జైపూర్ ఎస్ఐ
మంచిర్యాల బ్యూరో/ పెన్ పవర్
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి గ్రామంలో, నేను సైతం కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా కిరాణం షాప్ యజమాని ప్రశాంత్ సహకారంతో గ్రామములో 5 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ప్రశాంత్ నీ అభినందించారు. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి గ్రామల సర్పంచ్, గ్రామ పెద్దలు, వ్యాపారస్తులు, సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాల ద్వారా ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని, ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలుసుకోవచ్చని, సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణ గా నిలుస్తాయని తెలిపారు.సీసీ కెమెరాల ద్వారా జైపూర్ డివిజన్లో ఎన్నో కీలకమైన కేసులు చేదించామన్నారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎస్సై రామకృష్ణ పెగడపల్లి మండల ప్రజా ప్రతినిధులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment