గుంటూరు
మేయర్ పీఠంపై జనసేన కన్ను...
బ్యూరో రిపోర్ట్ గుంటూరు , పెన్ పవర్
ఏపీలో
మార్చి 10 వ తేదీన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 14 వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఇక ఈ ఎన్నికలకు సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను
రద్దుచేసి కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో మొత్తం 16 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ పిటిషన్లను కొట్టివేసింది.
ఎస్ఈసి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇక ఇదిలా ఉంటె, గుంటూరు మున్సిపల్
కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకోవడానికి జనసేన పార్టీ
పావులు కదుపుతున్నది. ఇటీవలే జరిగిన పంచాయతీ
ఎన్నికల్లో మెజారిటీ పంచాయతీలను కైవసం చేసుకోలేకపోయినా, జనసేన
పార్టీ మెరుగైన ఓటు షేరింగ్ ను సాధించింది.
ఎలాగో బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో మరింత మెరుగ్గా ప్రచారం చేసి కార్పొరేషన్
ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన అన్ని మార్గాలను పార్టీ అన్వేషిస్తోంది. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని,
మేయర్ పదవి జనసేన పార్టీకి సొంతం చేసుకుంటుందని జనసేన నేత బోయిన శ్రీనివాస్
యాదవ్ పేర్కొన్నారు. వైసీపీ ఓటమి భయంతోనే దాడులు
చేస్తున్నారని, వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా విజయం తమదే అని
అన్నారు. అభివృద్ధి కావాలో, వైసీపీ ఇస్తున్న తాయిలాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు.
No comments:
Post a Comment