మాధవసేవగా మానవ సేవ చేయాలి
వేడుకగా విశ్వశాంతి సనాతన సత్సంగ వార్షికోత్సవం
అనపర్తి, పెన్ పవర్ :
సమాజంలో ప్రతి మానవుడు భగవంతుని పట్ల శ్రద్ధ, భక్తి , విశ్వాసం కలిగి ఉంటూ భగవత్ సేవతో పాటు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టెలిఫోన్ గురుస్వామి అన్నారు. అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద విశ్వశాంతి సనాతన సత్సంగ 22వ వార్షికోత్సవ వేడుకలు సత్సంగ వ్యవస్థాపకులు టెలిఫోన్ గురుస్వామి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఎన్. ఆర్. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తాడి సతీష్ రెడ్డి, శ్రీమతి సుమదివిజ దంపతులు విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పొలమూరు గ్రామ సర్పంచ్ గుడాల ధనలక్ష్మి వెంకట్రావు దంపతులను, వైస్ ప్రెసిడెంట్ సత్తి సూరారెడ్డి,వెంకటరెడ్డి లను సత్సంగ అధినేతలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాడి లచ్చారెడ్డి గిరిబాల, తాడి సత్యనారాయణ రెడ్డి పార్వతి, గొలుగూరి సత్తిరెడ్డి అనిత, గొలుగూరి విజయలక్ష్మి, మల్లిడి వీర్రాఘవరెడ్డి, సత్తి వీర్రాఘవరెడ్డి, మల్లిడి నాగిరెడ్డి, సత్తి కనకారెడ్డి,వనములు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment