Followers

అధికారుల తప్పిదాలకు..మేకకు శిక్షా..?

 అధికారుల తప్పిదాలకు..మేకకు శిక్షా..?

హరితహారం మొక్కలను తిన్న మేకలకు జరిమానా..

మొక్కలకు రక్షణ వలయాలు ఏర్పాటు చేయనందుకు అధికారులకు ఏ శిక్ష వేయాలో..?



మొక్కలకు ట్రీగార్డులు ఉన్నాయా..ఉంటె మేకలు తినే అవకాశం ఉంటుందా..

అధికారుల తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే జరిమానాలు..? 

మూగజీవాల పట్ల ఏవిధంగా వ్వవహరిస్తున్నారో ఈ అధికారులను చూసి నేర్చుకోవాలా..?

ఉన్నతాధికారుల మెప్పు పొందటానికే ఈ చర్యలా..?

కొండను తవ్వి ఎలుకను పట్టడం అంటె ఇదేనేమో..




కుత్బుల్లాపూర్, పెన్ పవర్

దుండిగల్ మున్సిపల్ అధికారుల వ్యవహారశైలి ఈ మధ్య చిత్ర విచిత్రంగా తయారౌతుంది. హారితహారం మొక్కలను తిన్నందుకు మేకలకు 100/- రూపాయల జరిమానా విధించారు.. మరి వాటికి ట్రీగార్డులను ఏర్పాటు చేయనందుకు అధికారులకు ఎలాంటి   శిక్ష వేయాలో అని పలువురు జంతుప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.. నిర్వహాణ సరిగ్గాలేక ఎండిపోయిన మొక్కలు దుండిగల్ మునిసిపాలిటీ లో కోకొల్లలు.. అవకాశం దొరికింది కదా అని.. ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే  మేకలు తిన్నాయని చెప్పుకోవడానికి రికార్డు కోసం ఇదంతా చేస్తున్నారని జంతుప్రేమికులు ఆరోపిస్తున్నారు.. 



వివరాల్లోకి వెళితే శనివారం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దొమ్మర పోచంపల్లి సాయిపూజ కాలనీకి చెందిన నవాజ్ కు సంభందించిన  మేకలు మున్సిపాలిటీ కార్యాలయానికి సమీపంలో ఉన్న రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పై అక్కడక్కడ హరితహారంలో నాటిన మొక్కలను తిన్నాయని మున్సిపాలిటీ సిబ్బందికి కోపం వచ్చింది. ఇక అంతే మొక్క తిన్న మేకకు వారి స్టైల్ లో ట్రీట్మెంట్ చేసి మరీ జరిమానా విధించారు.. మరి మిగతా మొక్కలకు కనీసం ట్రీ గార్డులు కూడా వేయకుండా  గాలికి వదిలేశారు. మొక్కలకు ఎలాంటి ట్రీ గార్డులు ఏర్పాటు చేయలేదు..అలాంటి మొక్కలు కనిపించగానే మూగజీవాలైన మేకలు తిన్నాయని యజమాని "నవాజ్" కు 100 రూపాయలు జరిమానా విధించారు.. 


టెక్నాలజీతో పోటీపడుతూ ముందుకెళ్తున్న మానవులే మతిస్థిమితం లేక వ్యవహరిస్తుంటారు.. అలాంటిది నోరులేని మూగజీవివులకు జరిమానాలు విధించి దుండిగల్ మున్సిపాలిటీ అధికారులు తమ సత్తాను చాటుకుంటున్నారు.. అక్రమనిర్మాణాలపై ఎన్ని సార్లు స్థానికులు ఫిర్యాదులు చేసినా దున్నపోతుపై వర్షంపడ్డ చందంగా స్పందించని మున్సిపల్ అధికారులు.. ఇలాంటి  విషయాలలో మాత్రం చాలా తొందరగానే చర్యలు తీసుకోవడం కొసమెరుపు...

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...