రూ 2లక్షల 50 వేల అక్రమ మద్యం బాటిళ్ల పట్టివేత
నాయుడుపేట, పెన్ పవర్
నాయుడుపేట పట్టణ సమీపంలో జువ్వల పాళెం రోడ్ వద్ద శనివారం ఎస్ ఈ బి అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి రూ 2 లక్షల 50 వేల రూపాయల విలువ గల 1650 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయుడుపేట ఎక్షైజ్ కార్యాలయంలో ఎస్ ఈ బి అధికారులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ ఈ బి ,డీ ఎస్ పి లు బి.వెంకటేశ్వర్లు,ఈ. శ్రీనివాసరావు మాట్లాడారు. గోవా నుండి ఒంగోలు జిల్లా చీరాలకు అక్రమంగా చేపల లోడు వ్యాన్ లో మద్యం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు త సిబ్బంది చేపల లోడు మాటున అక్రమ మద్యం తలిస్తున్న వ్యాన్ ను నాయుడుపేట పట్టణ సమీపంలో స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు.
వ్యాన్ లో ఉన్న 1650 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడం తోపాటు మద్యాన్ని తరలిస్తున్న డ్రైవర్ షేక్ కామిల్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ ఈ బి,సి ఐ షేక్. అబ్ధుల్ జలీల్,ఎస్ ఐ శేషమ్మ వున్నారు.అప్రమత్తంగా వ్యవరిస్తూ అక్రమ గుట్కా,మద్యం ను పట్టుకుంటున్న నాయుడుపేట ఎస్ ఈ బి,సి ఐ అబ్దుల్ జలీల్, ఎస్ ఐ శేషమ్మలను ఎక్షైజ్ డి ఎస్ పి లు అభినందించారు.
No comments:
Post a Comment