ఏప్రిల్ 14 నుంచి బ్లూ సెట్ ఉద్యమానికి సిద్ధం కావాలి...
* మాదిగ జేఏసి వ్యవస్థాపకులు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి,
* ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు
ఆదిలాబాద్,పెన్ పవర్
ఎస్సీ మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కై ఏప్రిల్ 14 నుంచి చేపట్టే బ్లూ షర్టు ఉద్యమానికి కార్యకర్తలు సిద్ధం కావాలని మాదిగ జేఏసి వ్యవస్థాపకుడు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. మాదిగ జేఏసి తరపున మాదిగల చైతన్య యాత్రలో భాగంగా శనివారం జిల్లా కేంద్రనికి చేరుకుంది. జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా మాదిగ జేఏసి నాయకులతో కలిసి మాట్లాడుతు, బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ ల వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం రెండుసార్లు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ వర్గీకరణపై ఊసే లేదని అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పించి, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకూ మాదిగల మంత ఏకమై ఉద్యమిస్తామని అన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై, ఏప్రిల్ 14 నుంచి నీలి చొక్కా ఉద్యమం చేపట్టడం జరుగుతుందని, ఈ ఉద్యమానికి ఎస్సీ, ఎస్ టి, బీసీ, మైనారిటీ లు పాల్గొనాలని అన్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లపై అడుగడుగునా అన్యాయం జరుగుతుందని, భవిష్యత్తులో నీలి రంగుకు, కాషాయం రంగుకు పోటీ ఉంటుందన్నారు. కాషాయం రంగు తో అంబేద్కర్ వాదులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి దీరన్,మాదిగ జేఏసీ నాయకులు మైన ఉపేందర్,గడ్డ యాదయ్య,నక్క రాందాస్, మల్యాల మనోజ్, సురేష్, ప్రసన్న,మారంపల్లి శంకర్,అశోక్, విలాస్,సాంబశివ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment