విశాఖ ఉత్తరం, పెన్ పవర్
ఉత్తర నియోజకవర్గ పరిధిలో గల పాత 11 వార్డు కొత్త 14, 24, వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొంప ధర్మరావు మరియు వారి అనుచరులు కలిసి ఈరోజు నగర వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు ఆధ్వర్యంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సమక్షంలో వీరికి కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు, ఎం.వి ఎల్.వి.సత్యనారాయణ, వుడా మాజీ చైర్మన్ రవి రాజు గారు,సీనియర్ నాయకులు భరణికాన రామారావు 14వార్డ్ అభ్యర్థి కె. అనిల్ కుమార్ రాజు,పాకలపాటి అప్పల నరసింహ రాజు (బాక్సర్ రాజు ) 24వార్డ్ అభ్యర్థిని సాడి పద్మ రెడ్డి, బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment