ఘనంగా సూర్య భాగవనుడికి 108 సామూహిక సూర్య నమస్కారాలతో రధసప్తమి
ఎం.వి.పి. కాలనీ, పెన్ పవర్
రధసప్తమి సందర్భంగా ఓం ఉచిత యోగ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ యోగా గురువు చిలక రమేష్ పర్వవేక్షణలో 108 సామూహిక సూర్య నమస్కారాలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం బీచ్ రోడ్ లో ఉన్న జి ఆర్ ఎంపైల్ ప్యాలెస్ లో నిర్వహించారు. సుమారు 165 మంది సాధకులు, 108 రకాలుగా సూర్య నమస్కారాలు, వైదిక మంత్రోచ్చారణలతో చేశారు.
వర్చువల్ పద్దతిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాధకులతో పాటు విదేశాలలో ఉన్న సాధకులు కూడా పాల్గొన్నారు. ఈ.సందర్భంగా యోగ గురువులు చిలక రమేష్ విలేకర్లతో మాట్లాడుతూ, ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, బరువు తగ్గలనుకునేవారు, ఒత్తిడికి గురయ్యే వారు, ఇంకా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావారైనా తమ " ఓం ఉచిత యోగ సంస్థ" ను ఫోన్ నంబర్ 93 33 33 33 44 లో వారి సమస్యలు తెలిపితే వారి సమస్యలకు తగ్గట్టు, వారికి ఉచితంగా యోగ పద్ధతులు నేర్పిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమానికి నగరం నలుమూలల నుండి అనేకమంది సాధకులు, భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment