కరోనాతోహడలెత్తి పోతున్న గోపాలపట్నం వాసులు.
గోపాలపట్నం,పెన్ పవర్
దేశం యావత్తు కరోనా వైరస్ కు అతలాకుతలం అయిపోయింది పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు దీని బారిన పడ్డారు ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల లో ప్రజలు కరోనా వ్యాధి తో మృత్యువాత పడుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి గల్లీ వరకు కరోనా మరణ మృదంగం వాయిస్తూ ఉంది పెద్ద పెద్ద నగరాల్లో కాకుండా చిన్న చిన్న నగరాల్లో కూడా దీని ప్రతాపాన్ని చూపిస్తుంది నిన్నటి మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న గోపాలపట్నం లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదై గోపాలపట్నం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది మంగళవారం ఒక్కరోజే గోపాలపట్నం లక్ష్మీ నగర్ లో 8 కేసులు నమోదవడంతో ప్రజల మరింత భయభ్రాంతులు గురయ్యారు అలాగే ప్రక్కనే ఉన్న ఇందిరానగర్. పెట్రోల్ బంక్ చుట్టుపక్కల ప్రాంతాలు. చాకలి గడ్డ. నరసింహ నగర్. ఏ పీ ఎస్ సి బి కాలనీ. ప్రజలు కరోనా వైరస్ ఏ క్షణంలో ఎవరికి సోకుతుందో అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న వైనం నేడు గోపాలపట్నం ప్రజల వాసులు దయనీయ పరిస్థితి కావున జీవీఎంసీ వారు వెంటనే స్పందించి వీధి వీధినా శానిటేషన్ చేయాలని అలాగే పోలీసు వారు ప్రజల విచ్చలవిడిగా తిరగకుండా కంట్రోల్ చేసే బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు
No comments:
Post a Comment