నాటుసారా విక్రయ కేంద్రాలపై దాడులు జరిపిన పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను .
పోలవరం పెన్ పవర్
పోలవరం మండలం ఎల్ ఎన్ డి పేట గ్రామంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో నాటుసారా విక్రయ కేంద్రాలపై పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీనివాస్ సిబ్బందితో దాడులు జరిపారు. ఈ దాడుల్లో నాటుసారా విక్రయిస్తున్న ఆసుబోయిన యేసు అనే వ్యక్తిని అరెస్టు చేసి ఆరు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను తెలిపారు. నాటు సారా తయారీ, అక్రమ రవాణా, అమ్మకాలు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే పోలీసువారికి సమాచారం ఇవ్వాలని ఎస్ ఐ ఆర్ శ్రీను కోరారు. ఈ దాడుల్లో పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను, స్టేషన్ సిబ్బంది మోహన్ రావు, దుర్గాప్రసాద్ , బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment