Followers

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం భూములు కాపాడాలి





శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం భూములు కాపాడాలి

 

 మార్కాపురం, పెన్ పవర్

 

 అన్యాక్రాంతం అవుతున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం భూములను కాపాడాలి. ఆర్డిఓ కార్యాలయం లో సిపిఎం నాయకులు అర్జి అందజేత. మార్కాపురం పట్టణం సమీపంలోని సర్వేనెంబర్ 206 ఏ ,బి లో ఆరు ఎకరాల పైగా విస్తీర్ణం కలిగిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి చెందిన భూమిని పట్టణంలోని కొందరు ఆక్రమించారని, సదరు స్థలంలో వ్యాపారం కొరకు  నిర్మాణాలు కూడా జరుగుతున్నాయని, వివిధ దిన పత్రికలలో కూడా వార్తలు ప్రచురితం అయినాయి అని, కానీ దేవస్థానం అధికారులు పట్టీపట్టనట్లు గా వ్యవహరిస్తున్నారని, సదరు భూమిని వెంటనే కాపాడాలని కోరుతూ మార్కాపురం ఆర్డిఓ కార్యాలయం ఎఓ గారికి సిపిఎం ఆధ్వర్యంలో అర్జి అందజేయడం జరిగింది. అర్జీ అందజేసిన వారిలో సిపిఎం మార్కాపురం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య, సిపిఎం తాజా మాజీ కౌన్సిలర్ జవాజి రాజు, సిపిఎం నాయకులు ఏనుగుల సురేష్కుమార్ అర్జీ అందజేసిన వారిలో ఉన్నారు.


 

 




No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...