నాటు బళ్ళు కార్మికులకు ఇక్కట్లు
అనకాపల్లి
అనకాపల్లి పట్నంలో పూడిమడక రోడ్లో నాటు బళ్ళు కార్మికులతో శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక పాలసీ పేరుతో నాటు బండిలో ఇసుక రవాణా చేసే కార్మికులు 14 నెలలుగా పనులు లేక ఇసుక రవాణా సౌకర్యం ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో పాటు పశువులకు దాణా కూడా పెట్టలేక పోతున్నావ్ అని కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉందని కార్మికులు వాపోయారు . ప్రభుత్వం ఇసుక పాలసీ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాటు బళ్ళు తో గృహ నిర్మాణం చేసుకునేవారికి ఉచితంగా సరఫరా ఉంటుందని ప్రకటన చేసినప్పటికీ అధికార యంత్రాంగం రెవిన్యూ సిబ్బంది పోలీస్ అధికారులు అడ్డుకోవడం జరుగుతుందనారు. ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అధికారులకు ఆదేశాలు లేకపోవడంవల్ల మేము ఏమీ చేయలేమని సమాధానాలు చెబుతున్నారని వై సి సి శాసనసభ్యులు చోడవరం ప్రాంతంలో ఇసుక రీచ్ ను ప్రారంభించారని అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా అనుమతులు ఇచ్చి కార్మికులకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని నాగ జగదీష్ తెలిపారు రెవిన్యూ డివిజనల్ అధికారి శాసన మండల సభ్యులు మాట్లాడారని సోమవారం లోపు సమాధానం చెబుతామని హామీ ఇచ్చారని తెలిపారు. అనుమతులు ఇవ్వకపోతే అనకాపల్లి ప్రాంతం తో పాటు మూలపేట తుమ్మపాల ఇతర ప్రాంతాల నాటు బళ్ళు కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మల్ల సురేంద్ర, ఆళ్ల రామచంద్రరావు, అండిబోయినశేష, బొడ్డేడ మురళి , కొయిలాడ గణేష్, నాటు బళ్ళు కార్మికులు కర్రీ దుర్గ అప్పారావు ,బొడ్డేడ రామకృష్ణ, బొడ్డేడ వెంకటేష్ ,పూడి నూకరాజు, మల్ల పూర్ణచందర్రావు, లంక అప్పారావు ,కొణతాల అప్పారావు తుమ్మపాల ప్రాంతం నుండి కొణతాల అప్పారావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment