Followers

ఫార్మా ప్రమాద స్థలాన్నిపరిశీలనకి వెళ్లిన బండారు అరెస్ట్


ఫార్మా ప్రమాద స్థలాన్నిపరిశీలనకి వెళ్లిన బండారు అరెస్ట్


           పరవాడ, పెన్ పవర్

 

 జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ (రామ్ కి ఫార్మాసిటీ)లో సోమవారం రాత్రి విశాఖ సాల్వేoట్ లో జరిగిన ప్రమాదాని పరిశీలించండానికి వెళ్లిన మండల తెలుగుదేశం నాయకులతో కలిసి మాజీ మంత్రి,ఎమ్మెల్యే అయిన బండారు సత్యన్నారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేసి విశాఖపట్నం హార్బర్ పోలీస్ స్టేషన్లో ఉంచారు.అరెస్ట్ కు ముందు బండారు సత్యన్నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదం పై అఖిలపక్షం సభ్యులతో కమిటీ వేసి విచారణ చేయించాలి అని ముఖ్యమంత్రి ని డిమాండ్ చేశారు.ఫార్మా సిటీ నిర్వాసిత గ్రామాల్లోని ప్రజలు ప్రాణాలు గుప్పెటలో పెట్టుకుని బ్రతుకుతున్నారు అని అన్నారు.తామంతా అగ్ని గుండం పై కుచున్నట్లు ఉంది అని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని బిక్కు బిక్కుబిక్కుమంటూ తాడి,తాణాo,పరవాడ ప్రజలు బ్రతుకుతున్నాము అని అన్నారు.ప్రభుత్వం ఇప్పటికి అయినా ఈ ప్రమాదాల నివారణకు అఖిలపక్ష సభ్యులతో కూడిన కమిటీ వేసి ఫార్మా యాజమాన్యాల తో చర్చలు జరిగేలా చూడాలి అని డిమాండ్ చేశారు.మృతులకు,క్షతగాత్రులకు న్యాయం చేయాలని కోరారు.ప్రమాదానికి కారణం అయిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.బండారు తో మాజీ జెడ్పిటిసి పయిల జగన్నాధ రావు,అట్టా సన్యాసి అప్పారావు, కన్నూరి రమణ,బుగిడి గోవింద్,పరదేసి నాయుడు వున్నారు.

 

 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...