మాదిగ అమరవీరులకు మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఘన నివాళి
అశ్వాపురం, పెన్ పవర్
మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో సొమవరం అశ్వాపురం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ సాధనకై గత ఇరవై-ఐదు సంవత్సరాలుగా అలుపెరగని ఉద్యమాలు చేసి అమరులైన మాదిగలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు..ఈ సందర్భంగా మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల.నాగేశ్వరరావు పాల్గోని మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధనలో భాగంగా అమరులైన మాదిగల త్యాగాలను మర్చిపోలేము అని..వారి త్యాగాలను వృధా కానివ్వమని..ఎస్సీ వర్గీకరణ సాధనకోసం-వారి ఆశయ సాధనకు కోసం..విద్యావేత్త.. మాదిగల మలిదశ ఉద్యమ రథసారథి-ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయుకుడు-తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి.రవి నాయకత్వంలో..వర్గీకరణ సాదించేందుకు మాదిగలు సిద్ధంగా ఉంటామని తెలిపారు..కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాదిగలను..ఎన్నికల్లో హామీ ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకుండా మాదిగలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు...అనంతరం ప్రముఖ సంఘ సంస్కర్త..ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు-సమ సమాజ స్థాపన కృషీవలుడు.. భారత తొలి ఉప ప్రధాని.డా బాబు జగ్జీవన్ రాం వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు.మందా.హుస్సేన్-మండల సీనియర్ నాయకులు.ఇరుగు.నాగరాజు-మేకల.అంజిబాబు-రావులపల్లి.నర్సింహారావు-ఇసంపల్లి-పున్నారావు-ఆర్టీసీ ఉద్యోగులు సంఘం భాద్యులు.ఇల్లటూరి.మహేష్-కోడారి.వేణు-ఇసంపల్లి.సురేష్-మంగళగిరి.రామకృష్ణ-తాళ్లూరి.శ్రీను-గుర్రం.రాములు.దమ్మయ్య-తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment