పిన్న వయసులో "బాట్" రూపొందించిన తొలి బాలిక జోషిత నీలం
గండేపల్లి పెన్ పవర్!
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నికల్ హబ్ సి.ఈ.ఓ బాబ్జి నీలం కుమార్తె జోషిత నీలం. ప్రపంచంలోనే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ద్వారా బాట్ రూపొందించిన పిన్న వయసు (13సంవత్సరాలు) తొలి బాలికగా గుర్తింపు సాధించినట్లు బాబ్జి తెలియజేసారు. సామర్లకోట మండలం ఉండూరు లో గల లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ నందు 9వ తరగతి చదువుచున్న జోషిత ఆటోమేషన్ ఎనీవేర్ యూనివర్సిటీ నుండి ఇ -లెర్నింగ్ ద్వారా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ లో ఆడ్వాన్సుడ్ సెటిఫికేషన్ పూర్తిచేసినట్లు వివరించారు. లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ డా. సుగుణారెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో అడ్వాన్సు సర్టిఫికేషన్ కోర్స్ చేయడమే కాకుండా చక్కటి ప్రతిభతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం అభినందనీయం అని,ప్రతి ఒక్కరూ జోషితను ఆదర్శంగా తీసుకొని లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ ఉన్నత స్థాయి గుర్తింపు సాధించాలని కోరారు. రాష్ట్ర స్థాయి చదరంగం క్రీడాకారిణి అయిన జోషితకు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి,డైరెక్టర్ డా. ఎన్. సుగుణారెడ్డి,డా. ఎమ్. శ్రీనివాసరెడ్డి,లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. సాత్యకీ బెనర్జీ,లు అభినందించారు.
No comments:
Post a Comment