వరహా నదిలో పడి ఆవు మృతి
ఎస్.రాయవరం/విశాఖ పెన్ పవర్
ఎస్. రాయవరం మండలం ధర్మవరం- అగ్రహారం గ్రామంలో శుక్రవారం వరహానది లో ప్రమాదవశాత్తు పడి ఆవు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే ధర్మవరం మరియు ఏటికొప్పాక కు వరహానది పక్కనుండి గూర్జ్ రహదారి ఉన్నది. అక్కడ గూర్జ్ కి అనుకుని చాలా మంది రైతులకు భూములు ఉన్నాయి. అక్కడ గ్రామానికి చెందిన స్థానిక వైసీపీ నాయకుడు, ఎలిమెంటరీ స్కూల్ చైర్మన్ వెదుళ్ల బద్రి కి చెందిన ఆవు మేతకు వెళ్లి నీటిలో పడిపోయి చనిపోవడం జరిగింది. ఈ విషయమై ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వరహానది గట్టు గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోక నోరులేని మూగ జీవాలే కాక , మనుషులు కూడా కాలు జారి పడిపోయిన సంఘటనలు అనేకం జరిగాయి. అక్కడ గట్టు లేక కోతకు గురయ్యే భూములు కూడా ఏటిలో కలిసిపోతున్నాయి అని అక్కడ ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని కోరుతూధర్మవరం-అగ్రహారం గ్రామ మాజీ ఉపసర్పంచ్ సయ్యాదుల అచ్యుత్ కోరారు.
No comments:
Post a Comment