Followers

వైయస్సార్  జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు .


 


వైయస్సార్  జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు .


వైసిపి పోలవరం మండల అధ్యక్షుడు బుగ్గా మురళీకృష్ణ..


పోలవరం,  పెన్ పవర్


వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని పోలవరం మండలం   స్థానిక పంచాయతీ ఆవరణలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర వెంకట రెడ్డి, మండల అధ్యక్షులు బుగ్గా మురళీకృష్ణ  లు  స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు. అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బుగ్గా మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ వంటి మరెన్నో పథకాలు పేద ప్రజలకు చేరువయ్యేలా పరిపాలన కొనసాగించారని అందుకే ఆయనను అపర భగీరథుడు, రైతు బాంధవుడు, ప్రజల ఆశాజ్యోతి గా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారని అన్నారు. ఆయన దూరమైన ఈ 12 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరూ ఆయన్ని మరిచిపోలేదని గుర్తు చేశారు. ప్రజా పాలనలో, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంలోను, వాటిని అమలు చేయడంలోనూ తండ్రికి మించిన తనయుడుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సుంకర వెంకట రెడ్డి, బుగ్గా మురళీకృష్ణ, షేక్ పాతి మున్నీసా, దాకే మంగాయమ్మ, గంగు అనిల్ కుమార్,  పాదం రాజబాబు, డి రమేష్, సోబ్బాన మోహన్, ఘంటా శ్రీను, గోక చిట్టి రాజు, కె రాజు, శివ ప్రసాద్, రాణి, దుర్గ, అప్పారావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...