Followers

న్యాయవ్యవస్థపై దాడి


న్యాయవ్యవస్థపై దాడి


అయినవిల్లి ,పెన్ పవర్


దళిత న్యాయమూర్తిఎస్. రామకృష్ణ పై దాడి న్యాయవ్యవస్థపైన రాజ్యాంగ వ్యవస్థ పైన దాడి అని మండల టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు బి. జోగేష్ అన్నారు .ఈ మేరకు  ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో  దళితులపై ఒక పద్ధతి ప్రకారం దాడులు జరుగుతున్నాయన్నారు. జడ్జి రామకృష్ణ పై అగ్రవర్ణ నిందితులు దాడికి తెగపగడం రాష్ట్రంలో శాంతిభద్రతల తీరును ప్రతిబింబిస్తుందని అన్నారు. దళితుల మద్దతుతో గద్దెనెక్కిన జగన్ ప్రభుత్వం మిత్ర ద్రోహానికి పాల్పడుతుందన్నారు. డాక్టర్ సుధాకర్ ,డాక్టర్ అనిత, ప్రస్తుత సంఘటనలు  దళితులపట్ల ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని అన్నారు.  దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. రిజర్వ్ డ్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఇకనైనా మౌనం వీడాలని సూచించారు. దళిత వ్యతిరేకులకు ప్రాధాన్యతనిచ్చి దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయ ఉద్యోగుల్లో అభద్రతా భావానికి ఈ సంఘటన కారణమౌతుందన్నారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...