ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పెండింగ్ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి
సాంఘీక సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరి కె. ఆంజనేయలు డిమాండ్
(పెన్‌పవర్ స్టాఫ్ రిపోర్టర్, ఒంగోలు)
ఎస్సీ ఎస్టీ కేసుల్లో, పెండిరగ్ ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ సెక్రెటరీ కే ఆంజనేయులను దళిత నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సచివాలయంలో జాయింట్ సెక్రెటరీ ఛాంబర్‌లో దళిత హక్కు ల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రం, మాదిగ సంక్షేమ పోరాట సమితి అధ్యక్షులు కొమ్ము సుజన్ మాదిగ, మాల మహానాడు అధ్యక్షుడు దారా అంజయ్య కలిశారు .ఎస్సీ ఎస్టీ కేసులలో జిల్లా స్థాయిలో, కలెక్టర్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, క్లారిఫికేషన్ పేరుతో సెక్రటేరియట్ కు పంపించారు. విస్తర్ల వెంకట శేషమ్మ, మిట్ట గౌతమ్ కుమార్, పాపర్తి పద్మ అనే ఎస్సీ ఎస్టీకు, ఉద్యోగాల లిస్టు సాధారణ పరిపాన శాఖకు పంపించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాలు కేసును సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటేరియట్ విభాగానికి పంపించారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు జీవో ఎంఎస్ 95 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు హత్య కేసులో వెంటనే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, గతంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ సాంఘిక సంక్షేమ శాఖ ముద్దాడ రవిచంద్రకు ఫిర్యాదు చేశారు. సచివాలయంలో సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ సెక్రెటరీ కే ఆంజనేయులను కలిసి చర్చించగా, త్వరలో పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలకు ఉత్తర్వులు ఇస్తానని చెప్పారన్నారు.
No comments:
Post a Comment