Followers

వి.ఆర్.పురం మండలం టి.డి.పి. అత్యవసర సమావేశం


వి.ఆర్.పురం మండలం టి.డి.పి. అత్యవసర సమావేశం


వి.ఆర్.పురం, పెన్ పవర్:


వి.ఆర్.పురం మండలం వడ్డిగూడెం గ్రామంలో మండల టి.డి.పి. కార్యకర్తల సమావేశం మాజీ జెడ్.పి.టి.సి. ముత్యాల రామారావు ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మాజీ జెడ్.పి.టి.సి. ముత్యాల రామారావు మాట్లాడుతూ పోలవరం సమస్యలపై పోరాటానికి ముందుకు వచ్చి కలసి వచ్చే ఏ పార్టీతోనైనా కలుస్తామని ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఎకరానికి లక్షా పదిహేను వేలు ఇచ్చిన పొలాలకు ఐదు లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆరు లక్షలయాభైవేలకి బదులుగా పది లక్షల యాభైవేలు ఇస్తానని హామీ ఇచ్చారు. గత సంవత్సరం వరదల కారణంగా మండలానికి వచ్చిన ఎం.ఎల్.ఏ. ధనలక్ష్మి, డి.సి.సి.బి. చైర్మన్ ఆనంతబాబు గోదావరి వరదలలో ముంపుకి గురైన ఇళ్లకు ఐదువేల రూపాయలు ఇస్తామని అన్నారు కానీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఐదువేల రూపాయలు ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు న్యాయం ఎలా చేస్తుందని ఆయన అన్నారు. పాయం రామారావు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల సమస్యలపై పోరాటానికి తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వాళ్ళ వెంకటేశ్వరరెడ్డి, బొర్రా నరేష్, ముత్యాల సిద్దు, బొర్రా ఆది, ముత్యాల చంద్ర శేఖర్, ఆచంటి శ్రీను, ముత్యాల శ్రీను, బీరక సూర్యపరకాష్ రావు, బురక సారయ్య, బురక కన్నారావు, ముత్యాల శంకరరావు, ప్రవీణ్, బిష్టు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...