Followers

రైతులకు వడ్డీ రాయితీ


 


 ముమ్మిడివరం,పెన్ పవర్


రైతులకు వడ్డీ రాయితీ విషయం లో  పాత విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర రైతు సంఘం నాయకుడు గుద్ధటి రమా కేశవ బాలకృష్ణ (జమ్మి) తన నివాసంలో జరిగిన సమావేశంలో తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేయాలనుకుంటున్నా ఈ క్రాఫ్ విధానం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రాయితీ పొందడం సులభతరం కాదని, కాబట్టి ఈ క్రాఫ్ విధానం  విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవలసిన అవసరం ఉందని తెలియజేశారు. త్వరలో రాష్ట్ర రైతు సంఘం నాయకులతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు  సహకార శాఖ మాత్యులు శ్రీ కురసాల కన్నబాబు ని కలిసి  సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని రైతు సంఘం నాయకులుబాలకృష్ణ( జమ్మి)గారు తెలియజేశారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...