అర్హులైన లబ్దిదారులకు న్యాయం చేయాలి:బిజేపి మండల శాఖ
పాయకరావుపేట,పెన్ పవర్
అర్హులైన నిరుపేద లబ్దిదారులకు ఇళ్ళస్థలాలు మంజూరు చేయడంలో అన్యాయం జరిగిందని , గ్రంధాలయ మాజీ చైర్మెను,సీనియర్ బిజేపి నాయకులు తోట నగేష్ అన్నారు.ఈమేరకు బుదవారం ఆయన స్వగృహంనందు విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టృ బిజేపి పార్టీ ఆదేశాలమేరకు,రాష్టృ పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ పిలుపుమేరకు రాష్టృ ప్రజలకు వైఎస్సార్ ప్రభుత్వం నయవంచక మోసం చేసి ఇళ్ళస్థలాల మంజూరులో తీవ్ర అన్యాయం చేసినందుకుగాను మండల స్థాయి నిరసనలు తెలియజేస్తున్నామన్నారు.పేదోటి కల సాకారం చేస్తాడని,ఒక్క చాన్స్ అని నమ్మించి గద్దెనెక్కిన వైసీపి.ఇప్పుడు ఇళ్ళ స్థలాల విషయంలో ప్రజల గొంతుమింగుడు పడని మోసాలకు పాల్పడుతుంది.మండల ప్రతీ గ్రామంలో అవకతకలు జరిగాయి.లబ్దిదారుడువు అంటూ సెలక్షన్ లిస్టుల్లో పేర్లు చూపించి వైసీపి నాయకుల చేతివాటంతో అనర్హులు లబ్డిదారులగా ఎంపిక అయ్యారు.ఏళ్ళ తరబడి ఒకే ఇంటిలో నలుగురైదుగురు కుటుంబాలు కాపురాలు చేస్తుండటం చూస్తున్నాము.నిజమైన అర్హులను గుర్తించడంలో అదికారులు చేతిలెత్తేసారు.నిబందనల ప్రకారం గతంలో హౌసింగ్ లోన్ తీసుకున్న వారు,కరెంటుబిల్లు అదికంగా కట్టేవారు,భూస్వాములు,పింకు రేషన్ కార్డు కలిగినవారు ఇళ్ళ స్థలాలకు అనర్హులు.కాని ఇవేమి పట్టరాని నాయకులు ఇష్టానుసారంగా అనర్హులను అర్హులుగా చేసారు.దీనిపై పార్టీ పిలుపుమేరకు నిరసనలు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు రవిరాజు,మంచాల గాంధి,నానాజి,కోనా రంగయ్యస్వామి,జగతా శ్రీదర్ ,జగతా రమణ,కువల కుమార్ ,పెంకే శ్రీను,ఇంజరపు సూరిబాబు,ఐఎన్ .మూర్తి,రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment