మందుబాబుల నిర్లక్ష్యానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం.
మద్యం దుకాణాల వద్ద సిగపట్లు పడుతున్న మందు బాబులు.
మద్యం షాపుల వద్ద అమలుకాని నిబంధనలు.
నగరంలో చక్కెర్లు కొడుతున్న కరోనా మహమ్మారి.
అర వందకు చేరిన కోవిడ్_19 మరణాల సంఖ్య.
చోద్యం చూస్తున్న అబ్కారీ శాఖ అధికారులు.
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
నగరంలో మందుబాబుల తీరు జుగుప్సాకరంగా మారింది. తెల్లారింది మొదలు మద్యం దుకాణాల వద్ద క్యూ. కడుతున్నారు. మద్యం కోసం తోపులాటలు సిగపట్లు నిత్యకృత్యంగా మారిపోయాయి. మాస్కులు భౌతిక దూరం మరిచిపోయారు. కిక్కు కోసం కరోనా వైరస్ ను ఆలింగనం చేసుకుంటున్నారు.ఈ పరిస్థితి విభ్రాంతి కలిగిస్తున్న మందు బాబుల్లో చలనం కనిపించడం లేదు. నగరంలో కరోనా మహమ్మారి చక్కెరలో కొడుతున్న విషయం పట్టడం లేదు. కోవిడ్ మరణాలను సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరుచుకో కుండానే మందుబాబులు లైను కడుతున్నారు. మద్యం కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. క్యూ పెరిగిపోతే తోపులాటలు కొట్లాటలు మొదలవుతున్నాయి. భౌతిక దూరం మాస్క్ లు లేకపోయినా పట్టించుకోవడం లేదు. కోవిడ్ 19 లాక్ డౌన్ మార్చి 21 నుండి మొదలైంది. మద్యం షాపులు మూతపడడంతో మందుబాబుల నాలిక పిడచ కట్టు పోయింది. కిక్కు కోసం ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేశారు. నాటుసారా మత్తు మాత్రలు తో నిషాని కొనుక్కున్నారు. ఇంతలో ప్రభుత్వం మందుబాబులకు తీపి కబురు చెప్పింది. లాక్ డౌన్ సడలింపు ల నేపథ్యంలో మద్యం షాపులు తెరిచారు. షాపుల వద్ద 3 అడుగుల దూరం మాస్కులు గొడుగు తో క్యూలో ఉండాలని నిబంధనలు విధించారు. ఈ నిబంధనలు రెండు రోజుల ముచ్చటగా మారింది. మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులు తీరుతున్నారు. మద్యం మత్తు కోసం ఎగపడుతు కరోనా మహమ్మారిని మరిచిపోతున్నారు.మద్యం తీసుకు పోయి అదిక ధరలకు అమ్ముతున్నారు.
విజయనగరం జిల్లా జామి మద్యం షాపు వద్ద శుక్రవారం వర్షం లో కూడా క్యూలో మహిళలు మద్యం కొనుగోలు చేశారు. ఇది చూసిన వారు విస్తుపోయారు.
ఆ మహిళల ని అడిగితే కరోనా వల్ల పనులు లేవు మందు తీసుకు పోయి అధిక ధరకు అమ్ముతున్నం అని బదులు ఇచ్చారు. నగరం లో
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. నిత్యం పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కోవిడ్19 ఉధృతి తో నగరం అట్టుడికిపోతోంది. అయినా మందు బాబులలో మార్పు కనిపించడం లేదు. మద్యం సేవిస్తే కరోనా మహమ్మారి దరిచేరదని అనుకుంటున్నారేమో? కానీ కరోనా మహమ్మారి కి ఏ ఒక్కరు చుట్టం కాదు చిన్నాపెద్ద తేడా లేకుండా కాటేస్తుంది. మద్యం దుకాణాల వద్ద మందు బాబుల వీరంగం చూస్తున్నా అబ్కారీ శాఖ అధికారులకు చలనం లేదు. దుకాణాల వద్ద నిబంధనలు అమలు చేయడంలో విఫలం చెందారు. ఇప్పటికైనా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కళ్ళు తెరవకుంటే నగరంలో కరోనా వైరస్ మరణ మృదంగం మ్రోగించనుంది.
No comments:
Post a Comment