ఏలేశ్వరం లో భారీ వర్షం
జలదిగ్బంధంలో మార్కండేయ పురం.
ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలంలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో మండల పరిధిలోని రమణయ్య పేట గ్రామానికి చెందిన మార్కండేయ పురం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సుమారు 64.2 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. ఏలేశ్వరం పట్టణంలో వీధులన్నీ జలమయమయ్యాయి. మురుగు కాలువల సైతం రోడ్లపై ప్రవహించాయి. మండలంలో పలు గ్రామాల్లో పంటపొలాలు చెరువులను తలపించాయి. అయితే తమ్ముడు ఏలేరు రిజర్వాయర్ నిర్వాసితులకు సుమారు 30 ఏళ్ళ క్రితం రమణయ్య పేట వద్ద ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. అయితే అప్పటి నుంచి అనేక ఇబ్బందులు పడుతున్న వీరు కనీస వసతుల కోసం ప్రభుత్వ అధికారులకు మరి పెట్టుకుంటున్న ఇప్పటికే ఫలితం లేకపోయిందన్నారు. మురుగు నీరు పోవడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కొద్దిపాటి వర్షం కురిస్తే మొత్తం వీధులన్నీ బురదమయం అవుతున్నాయి. అయితే తే.గీ గురువారం కురిసిన భారీ వర్షానికి పంట పొలాల్లో వర్షపు నీరు ఇళ్ళ పై పడింది. మోకాళ్లలో వీటిలో మునిగిన తమ ఊరు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. వర్షపు నీటితో పాటు తేళ్ళూ, జెర్రెలు, విష సర్పాలు తమ ఇళ్లల్లోకి చొరబడి ఉన్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మార్కండేయ పురాన్ని ముంపు నుంచి కాపాడాలని కోరుతున్నారు.
No comments:
Post a Comment