Followers

ఊరొచ్చేస్తుంది



ఊరొచ్చేస్తుంది

 

పొదిలి, పెన్ పవర్

 

 

 

ఉన్న ఊరునొదిలి పట్నం బాట పట్టిన ఇద్ధరు రైతులు కరోనా కాలంలో ఎదుర్కొన్న కథనంతో .." ఊరొచ్చేస్తాంది" అనే సామాజిక  ప్రేరణతో కూడిన షార్ట్ ఫిల్మ్ షూటింగ్... పొదిలి పరిసర ప్రాంతాల్లోని పొలాలలో మేదరమెట్ల హైవే పై శని, ఆదివారాలు జరిగింది.. పొదిలి సిఐ శ్రీరాం మొదటి షాట్ కి దర్శకత్వం  వహించి షూటింగ్ ప్రారంభమైనట్లు ప్రకటించారు... లాక్ డౌన్ పరిస్థితులలో రైతుబిడ్డల మరోకోణం ఈ సామాజిక అవగాహన కల్పించే కథ కూర్పు బావుందన్న శ్రీరాం.... తెరపై మరి కొందరిలో మార్పు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించగా.... కేవలం రెండు నిముషాలు జరిగిన ఈ ప్రారంభోత్సవంలో   ఎస్ ఐ సురేష్ తదితరులు కూడా పాల్గొని షార్ట్ ఫిల్మ్  టీమ్ ని అభినందించారు..షూటింగ్ సమయంలో తీసుకోవలసిన కరోనా జాగ్రత్తలు సూచించారు.

 సీనియర్ జర్నలిస్టు కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ స్వీయ రచనా, దర్శకత్వం లో ఈ బుల్లిచిత్రం రూపుదిద్దుకుంది.  కరణం శ్యాంశరణ్, కోనూరు నాగరాజు లు మరో రెండు ప్రధాన పాత్రలను పోషించారు. విశ్వనాథ్, శ్రీనివాస్ తదితరులు నటించగా

 సినిమాటోగ్రఫీ  సుమంత్ వ్యవహరించారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...