Followers

రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు


రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు:  మంత్రి  ఆదిమూలపు సురేష్ 


 


మార్కాపురం, పెన్ పవర్


 

 

 స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కరోనా వైరస్ నివారణ,నియంత్రణకు తీసుకోవలసిన  చర్యల పై వైద్య ఆరోగ్య శాఖ,మున్సిపల్, పోలీసు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో  13 లక్షల మందికి కరోనా వైరస్ అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించడము జరిగిందన్నారు.రాష్ట్రంలో కరోనా వైరస్ అరికట్టేందుకు ముఖ్యమంత్రి వందల కోట్ల రూపాయలు వెచ్చించి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు.మార్కాపురం డివిజనల్ లో కరోనా వైరస్ పట్ల ప్రజలను అప్రమత్తంగా చేయాలని ఆయన చెప్పారు. ప్రజలకుఇబ్బంది లేకుండా కరోనా వైద్య పరీక్షలు వేగవంతంగా నిర్వహించాలన్నారు.మార్కాపురం డివిజనల్ ప్రధాన కేంద్రంలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారిని ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్ కు వెంటనే పంపాలని ఆయన చెప్పారు. మార్కాపురం డివిజనల్ లో అంబులెన్స్ ల కొరత కారణంగా రోగులను ఒంగోలు హాస్పిటల్ కు పంపడం తో ఆలస్యం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు అంబులెన్స్ వాహనాలను కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వారిని ఒంగోలు రిమ్స్ కు పంపడానికి సిద్ధంగా ఉంచాలని ఆయన వైద్యులను ఆదేశించారు. మార్కాపురం డివిజనల్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు కోసం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లతామన్నారు. మార్కాపురం డివిజనల్ లో కరోనా వైరస్ విస్తరించిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నియమాలను కఠినంగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వైద్య శాలల్లో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని ఆయన అన్నారు.కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన తెలిపారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ లు ధరించే విధము అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పాజిటివ్ కేసుల విషయం లో 104,108 వాహన సేవలను వినియోగించుకోవా లని ఆయన తెలిపారు. కరోనా వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సంజీవిని వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ అన్నా రాంబాబు, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ ఎం.శేషి రెడ్డి, డిప్యూటీ వ్ డి.ఎం.హ్.ఓ పద్మావతి, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ నాగేశ్వరరావు , ప్రభుత్వ హాస్పిటల్ సూపరిoడెంట్ డ్రా. విజయ లక్ష్మి, డ్రా.రాంబాబు,పట్టణ సి.ఐ శ్రీ  కె.వి. రాఘవేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. డివిజనల్ పౌర సంబంధాల అధికారి,మార్కాపురం

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...